BREAKING
ధనుష్, మారి సెల్వరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్! ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం!

పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి

Select Suryaa Now
పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్వగ్రామమైన పొలమూరులో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సత్తి కనకారెడ్డి ఆదిలక్ష్మి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. దీంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.గతంలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓటమి చవిచూడటంతో ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికలను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ స్వగ్రామం కావడంతో పొలమూరు సర్పంచ్ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.మరోవైపు కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. కూటమి అభ్యర్థి ఎవరనే అంశంపై గ్రామస్థులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థి ప్రకటన వెలువడిన తర్వాత గ్రామంలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎవరికివారు తమ మద్దతుదారులను సమీకరించుకుంటూ విజయావకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలపైనా ప్రధాన పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. వైసీపీ అభ్యర్థి ఆదిలక్ష్మికి పోటీగా కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొలమూరు పంచాయతీ ఎన్నికల పోరు రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.