చల్మెడలో గ్రామసభ..
చల్మెడలో గ్రామసభ..చల్మెడలో గ్రామసభ..రామాయంపేట;నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో గ్రామ కచేరి కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొమ్మెన మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై మొగ్గు చూపాలని సూచించారు. ప్రతి రైతు కంపోస్టు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు పొద్దుతిరుగు,మొక్కజొన్న, పెసర్లు,కందులు,ఆకుకూరలు వంటి పంటలు వేసుకుని నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ మేరకు గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఇంచార్జ్ ఎంపీడీవో ముజాహిద్, ఎంపీ ఓరజినీకాంత్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ గణేష్, ఇరిగేషన్ అధికారి మహరాజ్, ఉప సర్పంచ్ మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, వడ్ల తిరుపతి వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.