BREAKING
అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు అధ్యాపకుల కొరతను తక్షణమే పరిష్కరించాలి పెద్దూరులో ఆధ్యాత్మిక సందడి

యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు

Select Suryaa Now
యాదగిరి వ్యవహారశైలితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదంటూ అనిల్‌రెడ్డి వర్గీయుల విమర్శలు

వర్గల్; ; వర్గల్ మండల కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు, మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఫ్లెక్సీల దహనం ఘటనతో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మల్లారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఓ కాంగ్రెస్ నాయకుడు నిప్పంటించిన ఘటన వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్‌రెడ్డి గౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం తాను చేసిన సేవలను మీడియా సమావేశంలో వివరించారు.అనంతరం నర్సారెడ్డి వర్గీయులు సైతం మీడియా సమావేశం నిర్వహించి అనిల్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రస్థాయి నాయకులతో ఫొటోలు దిగుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడమే కాకుండా, అనిల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో గంజాయి మొక్క అంటూ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్‌రెడ్డి అనుచరులైన యూత్ కాంగ్రెస్ నాయకులు మరో మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించారు. పార్టీలో కొందరి వ్యవహారశైలి చీడపురుగుల మాదిరిగా మారిందని, ముఖ్యంగా దాసరి యాదగిరి వ్యవహారంతో పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని విమర్శించారు. పంచాయతీ పెట్టి చివరకు బాధ్యతల నుంచి తప్పుకునే వ్యక్తిగా యాదగిరిని అభివర్ణించారు.మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ ఇచ్చే ప్రతి పిలుపునూ ప్రజల్లోకి తీసుకెళ్లి కష్టపడుతున్న నాయకుడు అనిల్‌రెడ్డి అని వారు పేర్కొన్నారు.ఎన్నో ఏండ్లు గా మండలంలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ తనకుu తోచిన సహాయం చేస్తున్నాడని తెలిపారు.అలాంటి నాయకుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.