ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం..
రామాయంపేట;నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గ్రామానికి చెందిన పూసల చంద్రకళ నర్సింలు, లకు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని సర్పంచ్ బొమ్మన మల్లేశం, తాహసిల్దార్ శ్రీనివాస్, ల ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను అందించి వారి సొంతింటి కలను నిజం చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో ముజాహిద్,మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఏపీఓ రజినీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేందర్, ఇరిగేషన్ అధికారి మహారాజ్, వడ్ల తిరుపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.