ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ..
ములకలచెరువు, మేజర్ న్యూస్,
ములకలచెరువు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్,కేజీవిబి,బీసీ మరియు ఎస్సీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు జిల్లా డిఎంహెచ్ఓ జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు,వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ జాహ్నవి రెడ్డి మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దోమతెరలను క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా దోమకాటుకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, శ్రీనివాసులు,ఖాదర్ బాషా, లలిత, ఆశా కార్యకర్త అమరావతి తదితరులు పాల్గొన్నారు.