BREAKING
కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభం -విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు -నాయకత్వ లక్షణాలతో పాటు మానసిక వికాసానికి దోహదం : శాప్ చైర్మన్ రవి నాయుడు రావులపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ పరిస్థితి అయోమయం! సంపాదించుకున్న నాయకులు సైడ్‌.. కార్యకర్తల్లో సందిగ్ధం! కౌడిపల్లి పీహెచ్‌సీలో టీబీ స్క్రీనింగ్ క్యాంప్ పెద్దకల్వల కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక... - అధ్యక్షుడిగా సలేంద్ర రవి

వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి

Select Suryaa Now
వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి

 చేగుంట;ఎల్ నీనో ప్రభావంతో భవిష్యత్తులో సాగు నీటి సమస్యలు అధికంగా తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు వారికి బదులు ఆరుతడి పంటలను పండించడం మేలని చేగుంట మండల ప్రజా పరిషత్ అధికారి చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్, కరీంనగర్ గ్రామాలలో జరిగిన సమావేశాలలో ఆయన ప్రజలనుదేశించి మాట్లాడుతూ వర్షాలు కురువకపోవడం వల్ల అనేక చెరువులు, కుంటలలోనీరు తగినంతగా రాలేదని అన్నారు. రాబోయే కాలంలో సాగు, తాగునీటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. ముఖ్యంగా రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటలను వేసి నష్టపోవద్దని సూచించారు. ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న,సజ్జ,కంది, పెసర,మినుము,పొద్దు తిరుగుడు, కూరగాయలు వంటి పంటలను పండించి లాభపడాలని ఆయన కోరారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటిని పొదుపు చేసుకునే అలవాటును ప్రజలు అలవర్చుకోవాలన్నారు. వర్షపు నీటిని, మనం వినియోగించిన తర్వాత వచ్చే వృధా నీటిని భూమిలోకి ఇంకెలా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం, అధికారులు మాత్రమే నీటిని పొదుపు చేయలేరని,ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఎక్కువ మట్టుకు నీటిని వృధా కాకుండా చూడవచ్చు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామసభల ద్వారా ఎల్నీనో ప్రభావం వల్ల ఎదురయ్యే నీటి సమస్యలను ప్రజలకు తెలియజేపాలని ప్రయత్నిస్తోందన్నారు. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు,యువకులు  రాబోయే కాలంలో ఎదురయ్యే నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, అధిరులు ప్రజలు పాల్గొన్నారు.