BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
 సూర్య కరీంనగర్ ప్రతినిధి ;;రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు ఏర్పాట్లపై సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే పథకం లక్ష్యమన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభిస్తారని, ఈ నెల 14 నుంచి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి కుటుంబాల వివరాలు సేకరించాలని ఆదేశించారు.కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న సంపాదన సభ్యుల వివరాలతో పాటు ఆధార్, మొబైల్ నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ పేరు, సంబంధం, ఆధార్ వివరాలు, నామినీల వాటాలను నమోదు చేయాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. దరఖాస్తులను డిజిటలైజేషన్ చేసి, సంతకం చేసిన స్కాన్ ప్రతులను బీమా సంస్థకు పంపించాలని, వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ గీత, డీపీఓ జగదీశ్వర్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.