రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రామాయంపేట;ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ నాగరాజు పేర్కొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన మొత్తం రూ.2,73,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేటకు చెందిన కట్ట ప్రభాకర్, నాలుగో వార్డుకు చెందిన కోర్గుల అరవింద్, మొదటి వార్డుకు చెందిన ప్రసన్నతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని మరో ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పోచమ్మ గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింతల యాదగిరి మున్సిపల్ కౌన్సిలర్, దేవుని రంజిత్,బైరం కుమార్, మాజీ పట్టణ అధ్యక్షుడు డాకి స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.