BREAKING
సీఎం సభకు 16 ఎకరాల స్థలం ఖరారు! నాగదేవత ఆలయం సమీపంలో భారీ బహిరంగ సభ ప్రాంగణం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు యమాలపేట విద్యార్థిని ధనుష్, మారి సెల్వరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్! ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు

ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

Select Suryaa Now
ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

రామాయంపేట;రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి వ్యాపారి తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ రజనీకుమార్ సూచించారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో వరి విత్తనాలు విక్రయించరాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమార్ మాట్లాడుతూ.. ఎరువుల దుకాణాల్లో అనుమతులు లేని విత్తనాల విక్రయాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందేలా వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ గోపి తో పాటు ఎరువుల దుకాణం యజమానులు పాల్గొన్నారు