మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం ..
నర్సాపూర్;నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామానికి చెందిన గుర్రాల మల్లేశం ను మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా పట్లురి శ్రీనివాసరావు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ సభ్యులుగా మహమ్మద్ రియాజ్, మేఘమాల, వీరా గౌడ్, అంజయ్య, వేణుగోపాల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, రవిశంకర్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్ గౌడ్, నోముల హనుమంతు, శ్రీనివాస్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పాలకవర్గానికి రైతులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు..