మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి
రామసముద్రం,మేజర్ న్యూస్ : మండలంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూగవాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన తిమ్మారెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.గ్రామ ప్రజలు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని,తాగునీరు,రహదారులు,పారిశుద్ధ్యం,వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన స్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తానని వెల్లడించారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తిమ్మారెడ్డి స్పష్టం చేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి