BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం

Select Suryaa Now
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
 సూర్య కరీంనగర్;;స్థానిక టీఎన్జీవోల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న భారీ ర్యాలీకి కరీంనగర్ జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ర్యాలీ పోస్టర్‌ను విడుదల చేశారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ పీఆర్సీ నివేదికను తెప్పించుకుని నూతన పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని, నెట్‌వర్క్ ఆసుపత్రులు అదనపు చార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా అదనపు డబ్బులు వసూలు చేస్తే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, హర్మీంధర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావుతో పాటు వివిధ మండలాల నాయకులు, ఉద్యోగ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.