telangana
ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి
సూర్య ఎండపల్లి ;;ఎండపల్లి గ్రామంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ దేవి రవీందర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందించారు. గ్రామంలోని ఐదు ప్రధాన రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.55 లక్షలు అవసరమవుతాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆయా రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు