BREAKING
వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం ..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి..

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి..

తాడేపల్లి: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (X) ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్‌ జగన్‌ తన పోస్టులో డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చిత్తూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణం కాదా? అంటూ వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, తక్షణమే పెండింగ్‌ నిధులను విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.