BREAKING
బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు

పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ

Select Suryaa Now
పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి శుక్రవారం ఉదయం అన్నకూటోత్సవం (తిరుప్పావడ సేవ) అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానార్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు, అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, క్షేత్రంలో ప్రతి శుక్రవారం స్వామివారికి అన్నకూటోత్సవ సేవ నిరంతరం జరుగుతుందని తెలిపారు. ఈ విశేష సేవలో పాల్గొనదలిచిన భక్తులు రూ.500 రుసుము చెల్లించి సేవ టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు.

సేవలో పాల్గొన్న భక్తుల పేరిట వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి, స్వామివారి శేష తీర్థ ప్రసాదాలతో పాటు ఒక కేజీ పులిహోరను ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు.