విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి..
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-విద్యార్థి బాల్యం నుండి గమ్యాన్ని ఎంచుకొని ఆ దిశగా చదువు ప్రారంభించాలని బ్రైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం గౌసియా హసీనా పేర్కొన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 13వ తేదీ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి బహుమతులను మెడల్స్ ను అందజేశారు. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ దేశభక్తి గీతాలకు నృత్యాలతో విద్యార్థులు ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గౌసియా మాట్లాడుతూ.. బాలల దినోత్సవం అంటే బాలలు తమ గమ్యస్థానాలను ఎంచుకోవడం అని, ఆ దిశగా చదువులు ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. హసీనా మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు మార్కులతో పాటు సంస్కారాన్ని కూడా అలవర్చుకొని ఉన్నత ఆశయాలతో పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులు ముఖ్యంగా ప్రణాళిక బలంగా చదవడం వల్ల కచ్చితంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని దృడ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అఫ్రోజ్, కరీముల్లా, శివ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..