15 నుండి సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా మండలంలో జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఈనెల15 నుండి 17వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని మండల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి లక్ష్మిశంకర్ తెలిపారు. మండలంలోని 13 పంచాయతీలలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి నాలుగు కేంద్రాలలో నామినేషన్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. *మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో* కుందుర్పి,జంబగుంపల, నిజవల్లి,మలయనూరు, పంచాయితీలు, *ఆపిలేపల్లి సచివాలయలో* ఆపిలేపల్లి,ఎర్రగుంట, బసాపురం పంచాయతీలు. *బేస్తరపల్లి రైతుసేవకేంద్రంలో* బెస్తరపల్లి,తూముకుంట, మహంతపురం పంచాయితీలు, *తెనగల్లు సచివాలయంలో* ఎనుములదొడ్డి,తేనగల్లు, కరిగానిపల్లి పంచాయితీ లకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు *.టి. రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి*