జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 13, మేజర్ న్యూస్: జిల్లాలో గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మూడు విడతలలో పోలింగ్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ శుక్రవారం తెలిపారు.అనకాపల్లి జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉండగా, 642 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ శుక్రవారం తెలిపారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 6,335 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లాలో మూడు విడతలలో ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 12,28,253 మంది ఓటర్లు (పురుషులు 5,98,959; మహిళలు 6,29,277; ఇతరులు 17) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.మొదటి విడత లో అనకాపల్లి, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాలలో గల 8 మండలాలలో 217 గ్రామ పంచాయతీలకు 2,213 పోలింగ్ కేంద్రాలలో 4,56,597 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రెండవ విడత లో పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గం గల 8 మండలాలలో 213 గ్రామపంచాయతీలకు 2,092 పోలింగ్ కేంద్రాలలో 4,17,399 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.మూడవ విడత లో మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాలలో ఎనిమిది మండలాలలో 212 గ్రామపంచాయతీలకు 2030 పోలింగ్ కేంద్రాలలో 3,54,257 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ తెలిపారు.