BREAKING
ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్

రబీ సాగుకు రైతులు సిద్ధం కావాలి.. :జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్.

Select Suryaa Now
రబీ సాగుకు రైతులు సిద్ధం కావాలి.. :జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్.

                                 చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు..
గోదావరి డెల్టా పరిధిలో సాగునీటి సరఫరా, కాలువల మరమ్మతులు,…డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక                         దృష్టి.. వ్యవసాయానికి డిజిటల్ భరోసా.. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్..
అమలాపురం,మేజర్ న్యూస్ :రబీ 2026–27 సాగు సీజన్‌లో గోదావరి డెల్టా పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువల నిర్వహణ, పూడికతీత, అడ్డంకుల తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థల పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నీటి సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించి రబీ సాగు సన్నద్ధతపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన సాగునీటిని అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా సమర్థవంతంగా పంపిణీ చేయాలని తెలిపారు. చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా వంతులవారీ సరఫరా విధానాన్ని సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు
తాగునీటి చెరువులకు ప్రాధాన్యత :
జిల్లాలోని 44 తాగునీటి చెరువుల్లో ప్రస్తుతం సుమారు 50 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సమావేశంలో వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సాగునీటి సరఫరా సమయంలోనే అవసరమైన నీటిని సేకరించి, జిల్లాలోని మొత్తం 44 చెరువులను పూర్తిస్థాయిలో నింపి తాగునీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.రైతులకు సాగునీటి భరోసాతో పాటు డిజిటల్ గుర్తింపు, వ్యవసాయ సేవలు సమర్థవంతంగా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్‌ఈ, వ్యవసాయ శాఖ జేడీ ఎం. రామారావు, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, వివిధ డెల్టా ప్రాజెక్టు కమిటీల చైర్మన్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.