ఆ ఆరోపణలు అవాస్తవం...
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రైవేటు పాఠశాలలలో పదో తరగతి పరీక్షల ఫీజుల పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమని జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ఖండించారు. గురువారం పలు దినపత్రికలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న వార్తలు నిరాధారమైనవని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందిన, తమ దృష్టికి వచ్చిన సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పాఠశాల గుర్తింపు రద్దు చేసే చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అవాస్తవమైన వార్తలను ప్రజలు నమ్మవద్దని, సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలు నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు.
సీఎం గౌడ్ తిరుపతి సాఫ్ట్ రిపోర్టర్