BREAKING
పండ్ల రసం తాగడం మంచిదా లేక నేరుగా పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! ???? నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings ???? హోదా కోసం కాదు.. గ్రామ అభివృద్ధి బాధ్యత కోసం మీలో ఒక్కడిగా ఉంటా..సర్పంచ్ అభ్యర్థి గడ్డం శివ ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా

కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

Select Suryaa Now
కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!

 

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి

ఎస్.రాయవరం, నవంబర్ 13, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్తపోలవరం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలవరం బీచ్ నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు కారు సుమారు ఏడు అడుగుల ఎత్తుకు ఎగిరి స్తంభాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కురందాసు శ్రీను (24), కొర్ని శ్రీను (24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను కురందాసు ప్రసాద్, బొట్ట సురేంద్ర, కురందాసు శివ, కురందాసు అశోక్‌గా గుర్తించారు. వీరంతా గుర్రాజుపేట గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు ప్రమాదానికి గురికావడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి....
జరిగిన ప్రమాదం పై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్త రేవు పోలవరం వద్ద ప్రమాదం జరగడం అత్యంత బాధాకారం అన్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను హోమంత్రి అనిత ఆదేశించారు. పండగ పూట ఇలాంటి విషాద ఘటన జరగటం, ఇద్దరు యువకులు మరణించడం ఎంతో బాధాకరమన్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడ్డరోడ్డు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎస్ రాయవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయ చర్యలు తీసుకున్నారు.