గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు
అంకంపాలెం లో వైసీపీని వీడి తెలుగుదేశం చేరికలు
పంచాయితీ ఎన్నికల్లోను కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలి
పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులకే ప్రజల మద్దతు ఉంటుందని, వారు భారీ మెజారిటీలతో గెలవడం ఖాయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు మండలంలోని అంకంపాలెం లో 20 కుటుంబాలకు చెందిన వారు వైసీపీని వీడి జిల్లా ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమైందని తెలియజేశారు. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పట్ల వైసీపీలోని నాయకులు సైతం కూటమి వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కూటమికి ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగేది కాదన్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికల్లో సైతం విజయం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షులు కుదప కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ ముత్తా బత్తుల రాజు, ఎంపీటీసీ వేముల లక్ష్మి, కరుటూరి రవి, పడమట సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ కుటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.