ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు
అనకాపల్లి ప్రతినిధి, నవంబర్ 13, మేజర్ న్యూస్: విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సు–2026లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సి ఐ ఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా తదితరులు సందర్శించారు.ఈ సందర్భంగా ఏటికొప్పాకకు చెందిన సాంప్రదాయ కళాకృతులు, హస్తకళా ఉత్పత్తులను వారు ఆసక్తిగా పరిశీలించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఏటుకప్పాక బొమ్మల తయారీ కళకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యతను స్టాల్ నిర్వాహకులు వివరించారు. అంతర్జాతీయ వేదికగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏటుకప్పాక కళాకృతులకు ప్రదర్శన అవకాశం లభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు మరింత ప్రాచుర్యం లభిస్తోంది.