ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్..!
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎర్రావారిపాలెం మండలం వీఆర్ అగ్రహారం పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీఆర్ అగ్రహారానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న వారంతా ఆయనతో సమావేశమయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలు అమలు చేశారని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించారని గుర్తు చేశారు. అలాంటి పాలనను తిరిగి చూడాలనే ఉద్దేశంతో తాము వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీని వీడిచిపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సి.కృష్ణమూర్తి, సి.నవీన్, కె.భాను, ఎం.తరుణ్, వై.విజయ్, కె.రెడ్డెప్పలతో పాటు మరికొందరు ఉన్నారు. వీరందరికీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొత్తగా పార్టీలో చేరిన వారికి సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేసే సర్పంచ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
H. Dwaraka, staff reporter
9705347341