BREAKING
బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు

ముదిరెడ్డిపల్లి లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
ముదిరెడ్డిపల్లి లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

హిందూపురం :- ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్.సుధామణి,జి. రామచంద్ర రెడ్డి, శ్రీధర్ మూర్తి,మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్రను, దేశానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, నైతిక విలువలు అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర