BREAKING
వరి వద్దు ఆరుతడి పంటలే మేలు ఎంపీడీవో చిన్నారెడ్డి నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం ..

రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి

Select Suryaa Now
రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి
సూర్య కరీంనగర్ ప్రతినిధి ;; రబీ 2026-27 సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించి, రైతులను వరి సాగుకు బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వివిధ శాఖల పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, విద్య, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీ జీ రామ్ జీ పథకాలపై సమీక్షించారు.ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా పర్యవేక్షించి 90 శాతానికి పెంచాలని, డిజిటల్ విద్యా వేదికలను వినియోగించాలని తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సగటు హాజరు 73.68 శాతంగా ఉందని, దీనిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. కరీంనగర్, జమ్మికుంట, కొత్తపల్లి, హుజూరాబాద్ మండలాల్లో హాజరు తక్కువగా ఉన్నందున ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కేజీబీవీల్లోనూ హాజరు పెంచాలని, ఉపాధ్యాయులు, సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని, వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల పనితీరుపై ర్యాంకింగ్ విధానం రూపొందించి నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు.