శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు
నెల్లూరు నగరం దుర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశేషంగా 16 మంది రాహుకాల ఉద్యాపన పూజలో పాల్గొని అమ్మవారికి చీరజాకెట్టు, 108 నిమ్మకాయల మాలలు సమర్పించారు. రాహుకాల దీపాలు పెట్టిన భక్తులతోపాటు ఇతర భక్తులందరికీ ఉచిత ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపాలు వెలిగించగా, 6:30 గంటలకు సంధ్యమేళం, రాత్రి 7:30 గంటలకు కుంభహారతులు, 8:00 గంటలకు పల్లకీసేవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు సూరావర్జుల రఘురామమూర్తి, వేదపండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో జరిగాయి.