ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్
వికసిత్ భారత్ @ 2047 లో భాగముగా యువతను వినూత్నమైన ఆవిష్కరణలలో భాగస్వామ్యం చేయుట కొరకు, భారత ప్రభుత్వ ఆదేశాలనుసారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, యువజన సర్వీసుల శాఖ మరియు మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, 2027 - ఛాలెంజ్ ట్రాక్ లో బాగంగా ఈరోజు జి.పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఛాంపియన్షిప్ పి.పి.టి రౌండ్ పోటీలు నిర్వహించడమైనది.
ఈ సందర్బంగా జిల్లా ఛాంపియన్షిప్ పి.పి.టి రౌండ్ విజేతల ఎంపిక కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గారు మాట్లాడుతూ గతం లో ఒక కుటుంబం వారి జీవిత కాలం లేదా వారి తాత ముత్తాతల కాలం నుంచి ఒకే ఒకే వృత్తిలో, ఒకే కుల వృత్తిని లో జీవనం సాగించేవారని వారని, ప్రస్తుతం పరిస్థితి ఆలా లేదని రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ మారి పోయి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని, కుల వృత్తులకు దూరంగా వారికీ నచ్చిన వృత్తిలో లేదా టెక్నాలజీ తో పోటీ పడి రక రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఒకప్పుడు గత 20, 30 సంవత్సరాల క్రితం మెడికల్ సీటు, ఇంజినీరింగ్ సీట్లు, ఐఏఎస్, ఐపీఎస్ మొదలగు ఉద్యోగాలు అన్ని కేవలం పెద్ద పెద్ద నగరాలలో చదివే వారికే వచ్చేవని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగి, మొబైల్ ఫోన్ లోనే మనకు కావలసిన సమాచారం తెలుసుకొని మన ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చున్నని, కాబట్టి ఇంటర్నెట్, మొబైల్ టైం పాస్ కొరకు కాకుండా మన విజ్ఞానం పెంచుకొనే విధంగా ఉపయోగించి మన అర్హతలు, నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, 2027 - ఛాలెంజ్ ట్రాక్ లో పాల్గొంటున్న యువత మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా వినూత్నంగా అలోచించి కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు చేయాలనీ దానిని దేశ అభివృద్ధికి పాటు పడే రూపొందించాలని కోరారు.
తదుపరి డా.కె.వేణుగోపాల్. సెట్కూరు ముఖ్యకార్యనిర్వహణాధికారి గారు మాట్లాడుతూ “వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, 2027 - మై భారత్ పోర్టల్ ద్వారా స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 లో క్విజ్ మరియు వ్యాస రచన పోటీల నుంచి ఎంపిక కాబడిన వారితో ఛాలెంజ్ ట్రాక్ స్టేజ్ - III లో భాగంగా జిల్లా స్థాయి పి.పి.టి రౌండ్ ను నిర్వహిస్తున్నామని. ఇందులో విజేతలు నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పమ్పాపడునని మరియు రాష్ట్ర స్థాయిలో విజేతలైన వారిని న్యూఢిల్లీలో జనవరి, 12, 2027న శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించబడే జాతీయ యువజన ఉత్సవములకు అన్ని ప్రభుత్వ ఖర్చులచే పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజమ్ అధికారి తిరుమల నాయుడు, మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ ఐజయ్య గారు, పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు డా.దేవకీ, శ్రీ మురళి కృష్ణ, శ్రీ కురిడి సురేష్, ఆర్.జి.యం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు డా.సోఫియా ప్రియదర్శిని మరియు కర్నూలు మరియు నంద్యాల నుంచి యువత పాల్గొన్నారు.