BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

మదనపల్లి న్యూ తాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదంపై ఆరా : యజమాని పఠాన్ ఖాదర్ ఖాన్‌కు పరామర్శల వెల్లువ : టిడిపి జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు,యువనేత జునైద్ అక్బరీ

Select Suryaa Now
మదనపల్లి న్యూ తాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదంపై ఆరా : యజమాని పఠాన్ ఖాదర్ ఖాన్‌కు పరామర్శల వెల్లువ : టిడిపి జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు,యువనేత జునైద్ అక్బరీ

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ సమీపంలో ఉన్న న్యూ తాజ్ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదం తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.ఈ ప్రమాదంలో హోటల్‌లోని ఫర్నిచర్,వంట సామగ్రి,పాత్రలు,ఇతర విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ఘటన విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు,గాలివీడు జడ్పీటీసీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ శుక్రవారం ఉదయం న్యూ తాజ్ హోటల్‌ను సందర్శించి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం హోటల్ యజమాని,రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్, పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆప్యాయంగా పరామర్శించి,ప్రమాదం జరిగిన తీరును,జరిగిన ఆస్తి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.ఇందులో భాగంగా ఖాదర్ ఖాన్ ధైర్యం చెబుతూ అనుకోని ప్రమాదం కారణంగా ఎదురైన నష్టానికి చింతిస్తున్నట్లు వారు తెలిపారు.వ్యాపార రంగంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా,ఆత్మవిశ్వాసంతో తిరిగి నిలబడాలని సూచించారు.బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించి,సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చి,మరింత పెద్ద ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది సేవలను ఈ సందర్భంగా అభినందించారు.రాజకీయాలకు,పదవులకు అతీతంగా ఆపదలో ఉన్నవారిని పరామర్శించడం,వారి కష్టాల్లో భాగస్వాములై ధైర్యం చెప్పడం నిజమైన మానవత్వానికి నిదర్శనం.ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ అండగా నిలబడటమే తన బాధ్యతగా భావించే సుగవాసి ప్రసాద్ బాబు,జునైద్ అక్బరీల మానవీయ స్పందన పలువురి ప్రశంసలు అందుకుంది.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి