BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. * కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

Select Suryaa Now
వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన..  * కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

దుబ్బాక …దుబ్బాక నియోజక వర్గంలో అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో నగరం, భూంపల్లి, బేగంపేట గ్రామాలలో రైతుల సౌకర్యార్థం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అక్బర్‌పేట భూంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శంకర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరి కమలాకర్, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మారెడ్డి, తిప్పన బోయిన పున్నవ్వ, మండల ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రదీప్ రెడ్డి, నగరం ఉపసర్పంచ్ జీడిపల్లి రమేష్, బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి పాతురి శ్రీనివాస్ గౌడ్, వేల్పుల యాదయ్య, స్వామి, ఆలయం తదితరులు పాల్గొన్నారు.