BREAKING
అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రెస్ మీట్‌లో బోరున విలపించిన 'బ్లాక్ గోల్డ్' చిత్ర నిర్మాత మూర్తి.. అసలు కారణం ఏమిటంటే? ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం.. ‘ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. * కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్

Select Suryaa Now
ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :     జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం, నెల్లూరులో పి జి ఆర్ ఎస్  బృంద సభ్యులతో శుక్రవారం జడ్పీ సీఈవో ఎస్ మధుసూదన్  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ  పనితీరు, ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, నిర్ణీత గడువులోపు ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పి జి ఆర్ ఎస్   బృంద సభ్యులకు క్రింది సూచనలు సీఈవో  జారీ చేయడం జరిగింది.  ఫిర్యాదులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు. పి జి ఆర్ ఎస్ ద్వారా అందిన అన్ని ఫిర్యాదులను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై నిరంతరం ఫాలోఅప్ చేయాలనీ,నిర్ణీత ఎస్ ఎల్ ఎ   గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకున్న అనంతరం సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని అన్నారు. సంబంధిత శాఖలకు చెందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని శాఖాధిపతులతో  నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమన్వయంతో పనిచేయాలని,  నాణ్యతా తనిఖీ పరిష్కరించిన ఫిర్యాదులపై క్రమం తప్పకుండా నాణ్యతా తనిఖీలు నిర్వహించి, తీసుకున్న చర్యలు సరైనవిగా, సమగ్రమైనవిగా,  ఫిర్యాదుదారునికి సంతృప్తికరంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు . పెండింగ్‌లో ఉన్న,  పరిష్కరించిన ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ, ఫాలోఅప్ చేపట్టాలని, పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అన్నారు.  పి జి ఆర్ ఎస్  బృంద సభ్యులందరూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు.  ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన,  సత్వర సేవలు అందిస్తూ, పి జి ఆర్ ఎస్  వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచాలని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.