BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

మెదక్, ప్రతినిధి.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతం చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు తీరు, నమోదు ప్రక్రియ, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కులమతాలు, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు.నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పథకం అమలుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలు, పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న రేషన్ కార్డుల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కుటుంబాల నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. రేషన్ కార్డులు లేని కుటుంబాల వివరాలను కూడా సర్వే ఆధారంగా పరిశీలించి పథకంలోకి తీసుకురావాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు, పురపాలక సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నమోదు కేంద్రాల వివరాలు, తేదీలు, సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని తెలిపారు.

నామినీల ఎంపికపై స్పష్టమైన అవగాహన కల్పించాలి..

బీమా మొత్తానికి ఒకరిని లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కుటుంబాలకు కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకుంటే తమకు నచ్చిన విధంగా బీమా మొత్తాన్ని పంపిణీ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.దరఖాస్తుల నమోదు అనంతరం వాటిలోని వివరాలను కుటుంబ సభ్యులకు పూర్తిగా చదివి వినిపించి, వారికి అర్థమయ్యేలా వివరించిన తర్వాతే సంతకాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాము ఏ పథకం కోసం సంతకం చేస్తున్నారో, ఎవరిని నామినీలుగా ఎంపిక చేసుకున్నారో ప్రతి కుటుంబానికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

నవంబర్ 14 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు..

నవంబర్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, పురపాలక సంఘాలు, పురపాలక సంస్థల పరిధిలోని ప్రతి కుటుంబానికి పథకం లక్ష్యాలు, ప్రయోజనాలు, నమోదు విధానం, నామినీల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.నవంబర్ 17, 18 తేదీల్లో ప్రజలకు పథకం అమలు, నమోదు ప్రక్రియపై ముందస్తు సమాచారం అందించాలని, అవసరమైన ప్రచార సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి కుటుంబానికి పథకం సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకం విజయవంతానికి జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నమోదు ప్రక్రియలో కచ్చితత్వం పాటించాలి: సీఎస్ సంజయ్ జాజు..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పూర్తిగా అంతర్జాల ఆధారితంగా రూపొందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు, బీమా ప్రయోజనం పొందే వారి వివరాలు, నామినీల సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.నవంబర్ 19 నుంచి తదుపరి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నమోదు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పథకం విధివిధానాలపై ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత శాఖల అధికారుల ద్వారా నివృత్తి చేసుకొని, అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.ఈ దృశ్యశ్రవణ సమావేశంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ముఖ్య ప్రణాళిక అధికారి సురేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.