BREAKING
రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

Select Suryaa Now
 బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

విజయవాడ, మేజర్ న్యూస్ :  బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని బాలల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.వీరయ్య పేర్కొన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే బాలల హక్కుల వారోత్సవాలను విజయవాడ కబేలా సెంటర్ ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవం, సమాన అవకాశాలు పొందే హక్కు ఉందని తెలిపారు. పరిశీలన గృహంలోని బాలురు గత అనుభవాలను జీవిత పాఠాలుగా తీసుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవరచుకోవాలని సూచించారు. విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్.కె.చాంద్ భాషా, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ ఆరవ రమేష్, అమృత హస్తం ఫౌండేషన్ డైరెక్టర్ ధారా కరుణశ్రీ మాట్లాడుతూ బాలలు తమలోని ప్రతిభను గుర్తించి, గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. బాలల భవిష్యత్తుకు ప్రేమ, రక్షణ, విద్య, ఆరోగ్యం, గౌరవం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ శరత్ మాట్లాడుతూ బాలల సంక్షేమం, అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలు కలిసి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం బాలలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి సాధారణ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేపట్టారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్‌ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా రానున్న రోజుల్లో బాలల హక్కులు, రక్షణ, ఆరోగ్యం, విద్యపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృత హస్తం ఫౌండర్ ధారా రుక్మిణి, మాక్స్ విజన్ రీజినల్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కలపల భీమా, బర్డ్స్ సంస్థ సెక్రటరీ టీ.ప్రకాష్ కుమార్, డీసీపీవో రాజేశ్వరరావు, ఇన్‌టేక్ ప్రొబేషన్ ఆఫీసర్ అలీ బెగ్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.