BREAKING
రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి

Select Suryaa Now
జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి

విజయవాడ, మేజర్ న్యూస్ : భారత జనగణన 2027 రెండవ దశ ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ అధికారులకు సూచించారు.  జనగణనలో సేకరించే ప్రతి సమాచారం కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ జనగణన కార్యకలాపాల ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా, ఛార్జ్ స్థాయి అధికారులకు జనగణన 2027 రెండవ దశపై నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో రెండవ రోజు శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సెన్సస్ జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జనాభా లెక్కింపు ద్వారా సేకరించే గణాంకాలు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అందువల్ల సమాచార సేకరణలో ఖచ్చితత్వం, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనాభా లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, అధికారుల బాధ్యతలు, సాంకేతిక అంశాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. సమాచార సేకరణ సమయంలో ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేసుకుని, నిర్దేశిత పద్ధతులను కచ్చితంగా పాటించాలన్నారు. జనగణన కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, ఛార్జ్ స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయం కీలకమని పేర్కొన్నారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను జవాబుదారీతనంతో నిర్వహించి, జనాభా లెక్కింపు ప్రక్రియను నిర్ణీత మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎ.రవీంద్రరావు, మాస్టర్ ట్రైనర్ కొల్లేటి రమేష్, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సెన్సస్ ఇంచార్జి సి.హెచ్.వెంకటరమణ, ఇన్స్ట్రక్టర్లు వి.ఆదిలక్ష్మి, ఎం.స్వాతి, కలెక్టరేట్ మేజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.వెంకట రామయ్య, జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.