ఘనంగా మాజీ ఎంపీ విటల్ రావ్ జయంతి వేడుకలు
మహబూబ్ నగర్ మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత విఠల్ రావు జయంతిని దుద్యాల మండలం, సొంత గ్రామమైన లగచర్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులర్పించారు. విఠల్ రావు ఈ ప్రాంతానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రాములు గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.