శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం
తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్ : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజలు, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, స్వామివారికి నివేదన, హారతి నిర్వహించారు.
నవంబరు 15న శ్రీ నవగ్రహ హోమం
-------------------
హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నవగ్రహ హోమం నిర్వహించనున్నారు.
నేడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య కల్యాణం
------------
ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
గృహస్తులు రూ.500 చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,