BREAKING
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.. పాక్స్ ఛైర్మెన్ లింగాల రాజలింగారెడ్డి... ఈ నెల 15 జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు

ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలురాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Select Suryaa Now
ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలురాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

సంగారెడ్డి,ప్రతినిధి ; రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు తీరు, లబ్ధిదారుల నమోదు ప్రక్రియ, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలపై సమీక్షించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో జన్మించి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల పరిధిలో ప్రత్యేక కేంద్రాలు, నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను పూర్తిగా అంతర్జాల ఆధారితంగా రూపొందించినట్లు తెలిపారు. నమోదు సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు, బీమా ప్రయోజనం పొందే వ్యక్తుల వివరాలు, నామినీల సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తు పత్రాలు, నమూనా పత్రాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి…

దృశ్యశ్రవణ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పథకం అమలుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సిబ్బంది, సాంకేతిక సదుపాయాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ పథకం గురించి విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకిరెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సూర్యారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.