ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు
మదనపల్లి,మేజర్ న్యూస్ : యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక పట్టణంలోని శేషసాయి కళ్యాణ మండపం నందు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్,టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,పూల మురళి,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు కోన భాస్కర్,యర్రబల్లి వెంకటరమణా రెడ్డి,ఇడగొట్టి రెడ్డిశేఖర్ (డ్యాన్స్ రెడ్డెప్ప),కందికట్ల జయచంద్ర,ప్రశాంత్,మంగళ ప్రభాకర్,కట్టా లక్ష్మీనారాయణ,స్కంధ భాస్కర్,ముదిమడుగు రామూర్తి,మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు,పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.ఇందులో భాగంగా నూతన వధూవరులను వారు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కలిశెట్ల రెడ్డి గణేష్ అతి చిన్న వయసులోనే యువశక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డ రెడ్డి గణేష్ సమాజ సేవా కార్యక్రమాలలో భాగస్వామి కావడం శుభసూచకమన్నారు.రెడ్డి గణేష్,యామినిల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగాలని,అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో వారి కాపురం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.తమ ఆహ్వానం మేరకు వివాహానికి విచ్చేసి ఆశీర్వదించిన పట్టణ ప్రముఖులు,మిత్రులు,శ్రేయోభిలాషులకు నూతన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి