BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

-డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ

Select Suryaa Now
-డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి   -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ

పటాన్‌చెరు;డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం, బీబీఏ ప్రథమ సంవత్సరం నూతన విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఘన స్వాగతం పలికారు. కళాశాలలో కామర్స్, మేనేజ్‌మెంట్ విభాగాల సీనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ, అధ్యాపకులు మాట్లాడుతూ.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులు సంప్రదాయ విద్యతోపాటు డిజిటల్ ఆధారిత నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు.స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు సొంతంగా స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లక్ష్యంపై స్పష్టతతో,ఇష్టపడి కృషి చేస్తే ఆశించిన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు.ఫ్రెషర్స్ డే వేడుకల్లో భాగంగా అధ్యాపకులు, విద్యార్థుల మోటివేషనల్ ప్రసంగాలు, నృత్యాలు, పాటలు, ఫ్యాషన్ వాక్‌తో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పూనంకుమారి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. సుజాత, కామర్స్ విభాగాధిపతి షరీఫ్ మియా, డాక్టర్ మంజశ్రీ, డాక్టర్ బేబీ రమణి, కరుణకుమారి, డాక్టర్ వెంకటేశం,కామర్స్ మేనేజ్‌మెంట్ అధ్యాపకులు స్వప్న, సభా కానం, ఉమాదేవి, నందిని, బోధనేతర సిబ్బంది శివరాజు, అరుణ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.