విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్
రాయికోడ్;విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలు, వేధింపులు మరియు ఇబ్బందులను ఎలాంటి భయం లేకుండా, తమ గుర్తింపును గోప్యంగా ఉంచుతూ పోలీసుల దృష్టికి తీసుకువచ్చేందుకు షీ బాక్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ తెలిపారు.సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు మార్గదర్శకాల మేరకు రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు పాఠశాలల్లో షీ టీమ్స్ సహకారంతో షీ బాక్సులను ఏర్పాటు చేసి, విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈయొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మోడల్ స్కూల్ (TSMS), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), అల్లాపూర్ గురుకుల పాఠశాల, శ్రీ వివేకానంద హైస్కూల్ మరియు రాధాకృష్ణ మెమోరియల్ స్కూల్ (RKMS)లలో షీ బాక్సులను ఏర్పాటు చేయడం జరిగింది.అని తెలిపారు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన షీ బాక్సుల ద్వారా విద్యార్థినులు తమ సమస్యలు, ఫిర్యాదులను రహస్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని, అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే వేధింపులు, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, సైబర్ వేధింపులు వంటి సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా షీ బాక్సుల ద్వారా తెలియజేయవచ్చని సూచించారు.ఈ సందర్భంగా షీ టీమ్స్ సిబ్బంది విద్యార్థినులకు మహిళలు, బాలికల భద్రత, వ్యక్తిగత రక్షణ, సైబర్ నేరాలు మరియు వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని వారు సూచించారు బాలికలు ఎలాంటి భయం లేకుండా విద్యను అభ్యసించే సురక్షిత వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, బాలికల భద్రతకు సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు