BREAKING
తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ

ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి

Select Suryaa Now
ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఓఆర్ఎస్‌ ప్యాకెట్‌ అనుకుని పొరపాటున ఎలుకల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎదులాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదులాబాద్‌కు చెందిన తోటకూర రాములమ్మ (73) కొంతకాలంగా మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో నవంబర్‌ 12న మధ్యాహ్నం ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు గోపీకృష్ణను ఇంటికి పిలిపించారు. పరీక్షల సందర్భంగా ముందు రోజు రాత్రి తీవ్ర నీరసంతో ఓఆర్ఎస్‌ ప్యాకెట్‌ అనుకుని ఎలుకల మందు తాగినట్లు వైద్యుడికి తెలిపింది. దీంతో వైద్యుడి సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమెను ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 6.55 గంటలకు మృతి చెందినట్లు విధుల్లో ఉన్న వైద్యుడు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు తోటకూర మల్లేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టాల్సి ఉంది.