BREAKING
మానవ సంబంధాల ప్రాధాన్యత...సానుకూల స్పందనలు మరియు దయతోనే సమాజంలో మార్పు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన.. పాక్స్ ఛైర్మెన్ లింగాల రాజలింగారెడ్డి... ఈ నెల 15 జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వాస్ ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక

Select Suryaa Now
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక

నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్ : చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సరైన న్యాయం పొందవచ్చు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగర్ కర్నూల్  ఆధ్వర్యంలో  జాతీయ న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించే  వారోత్సవాలలో బాగంగా శుక్రవారం మంతటి గ్రామ పంచాయతీ కార్యాలయం  నందు చట్టాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి అన్నారు.  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వల్ల సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చు అన్నారు.తద్వార  నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు. . సైబర్  క్రైమ్ మరియు  మోటార్ వెహికల్ ఆక్ట్  ,పోక్సో చట్టం గురించి వివరించారు.ఎవరైనా న్యాయ వాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి మా సంస్థ తరుపున ఉచితంగా న్యాయవాదిని నియమిస్తాం అన్నారు. ఎవరికైనా ఉచిత న్యాయ సలహాలు కావాలంటే 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. 
----