BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత.

Select Suryaa Now
తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కల్వకుంట్ల కవిత.

గజ్వేల్ ; సిద్దిపేటలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టి ఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత హరీష్ రావుమీద చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ లో భాగంగానే చేశారని గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత కన్న తండ్రి కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలిన రోజే తెలంగాణ ప్రజలు ఆమెను మరిచిపోయారని అన్నారు.తన వ్యక్తిగత స్వార్థం కోసం రేవంత్ రెడ్డి కుట్రలో పావుగా మారిన కవిత కేవలం బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పలుచన చేసే విధంగా మాట్లాడుతూ బీఆర్అస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ మీడియాలో,పత్రికల్లో స్పేస్ కోసమే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారన్నారు.ఆ క్రమంలోనే ఈ రోజు సిద్దిపేటలో హరీష్ రావు మీద నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు.19 వ తారీకు రోజు జరిగే ముఖ్యమంత్రి మీటింగ్కు ఎజెండా సెట్ చేసే విధంగా కవిత మాట్లాడడంతోనే ఆమె రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని తేలి పోయిందన్నారు.కవిత విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన ఆరోపణలకు స్పష్టత లేదనేది తన మాటల్లోనే తేలోపోయిందని అన్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతూ 20 ఏళ్ల కింద వచ్చిన భూకంపం మేడ్చల్ లో వచ్చిందని మాట్లాడుతూ మోకాలికి బోడిగుండుకు ముడివేసే ప్రయత్నం చేశారని అన్నారు.నిమ్స్ ఉద్యోగుల పీఎఫ్ గురించి మాట్లాడుతూ 25 కోట్ల రూపాయలు దారి మళ్లాయని మాట్లాడిన తానే 100 కోట్ల కుంభకోణం జరిగిందని సంబంధం లేని అంశాలు ప్రస్తావించారని అన్నారు.అదే విధంగా కార్పోరేట్ వ్యాపారాల కోసం మాట్లాడిన కవిత  తన గతాన్ని మర్చిపోయి మాట్లాడారని అన్నారు.గతంలో కార్పొరేట్ కంపెనీల ఫ్రాంచైజీలతోనే వ్యాపార జీవితాన్ని ప్రారంభించి ఆఖరకు లిక్కర్ వ్యాపారం వరకు అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న తానే ఇవ్వాళ సిద్దిపేట ప్రజల్లో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం అవివేకమని అన్నారు.తన వ్యక్తిగత మనుగడ కోసం బీఆర్ఎస్ నాయకుల మీద కవిత మాట్లాడినంత మాత్రానా వాటిని పట్టించుకునే వారు ఎవరూ లేరని  సిద్దిపేట గడ్డ చాలా చైతన్యవంతమైన ప్రాంతమని కవిత ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా హరీష్ రావు  నిజాయితీ,నిబద్ధత,సమర్ధత సిద్దిపేట ప్రజలకు బాగా తెలుసని అన్నారు.సామాన్య ప్రజానీకానికి సైతం నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కోసమే పనిచేసే నిబద్ధత కల్గిన హరీష్ రావు  మీరు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా సిద్దిపేట ప్రజలనుండి హరీష్ రావును వేరు చేయలేవు ,ఇటువంటి చిల్లర ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకొని ప్రజల సమస్యల మీద నిజాయితీగా కొట్లాడాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో అహ్మదీపూర్ సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్,నాయకులు పాల రమేశ్ గౌడ్,శివకుమార్,స్వామి తదితరులు పాల్గొన్నారు.