BREAKING
*ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* 30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే

నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ

Select Suryaa Now
నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్నారు.శుక్రవారం విశాఖపట్నంలోని గాదిరాజు ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న నరేడ్కో ప్రాపర్టీ షో–2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొనుగోలుదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇళ్లను నిర్మించేందుకు బిల్డర్లు, డెవలపర్లు కృషి చేయాలన్నారు. నరేడ్కో సభ్యులకు ఎలాంటి సహాయం అవసరమైనా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలోనే ప్రాపర్టీ షో నిర్వహించడం
సంతోషకరమన్నారు. 
పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.