BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే

Select Suryaa Now
సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే

అమరావతి: సౌరవిద్యుత్‌ (సోలార్ పవర్) ఏర్పాటులో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో 50 శాతం మంది పారిశ్రామికవేత్తలు మహిళలే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారతపై సీఎం మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయాల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని గుర్తుచేస్తూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకంగా 8 మంది మహిళలు మేయర్లుగా ఎన్నికయ్యారని తెలిపారు.

మరోవైపు, ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిందని చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏరోస్పేస్ మరియు గ్రీన్ హైడ్రోజన్ వంటి ఆధునిక రంగాల దిశగా రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు.