BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు

Select Suryaa Now
బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు

సూర్య మంచిర్యాల :బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి (ఆర్డీవో) శ్రీనివాసరావు సూచించారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికలు అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు వారికి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించాలని సూచించారు.బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే సంబంధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించి,బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం కలిగే శిక్షలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసినా,ఇప్పటికే జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 5 నుంచి 16 వరకు పాఠశాలల్లో,17 నుంచి 26 వరకు ప్రార్థనా మందిరాలు,ఫంక్షన్ హాళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.నవంబర్ 27న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు,నవంబర్ 28 నుంచి డిసెంబర్ 21 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ బాల్య వివాహాలకు సంబంధించి చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని,వాటిపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.గ్రామ పంచాయతీ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని,జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు,రెవెన్యూ, మహిళా,శిశు సంక్షేమ, పోలీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.