BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

*చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

Select Suryaa Now
*చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

కోహిర్;నవంబర్ 14వ తేదీన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా కోహిర్ మండలంలోని చింతలగట్టు గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున జవహర్లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఉపాధ్యాయురాలు సంఘమని కుమార్తె ప్రణీత టీవీని బహూకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలకు టీవీని అందజేసిన ప్రణీతకు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.అనంతరం విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బాలల దినోత్సవం విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.