దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
దుర్గి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సీతారాం తెలిపారు. రెండవ శనివారం సందర్భంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతులతో పాటు సోలార్ ప్లాంట్లకు నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పోలేపల్లి, ముటుకూరు, కొలగొట్ల, నెహ్రూనగర్ తండా సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.విద్యుత్ అంతరాయాన్ని గమనించి వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మరమ్మతు పనులు సజావుగా జరిగేందుకు విద్యుత్ శాఖకు సహకరించాలని ఏఈ జి. సీతారాం కోరారు.
పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి