*ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ కింగ్ ప్యాలెస్ యజమాని వాస్తవం వెల్లడిస్తూ వీడియో విడుదల చేయగానే ఫంక్షన్ హాల్ వద్దకు ఫైర్ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులను పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి వ్యాపారికి అండగా అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పోలీసులను ఈ విషయంపై ప్రశ్నించగా. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ని నిలదీసినందుకే మమ్మల్ని ఫంక్షన్ హాల్ దగ్గరకు పంపించారు అని పోలీసులే సమాధానం చెబుతున్నారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లా అధికారులతో మరియు నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు అని సమాధానం చెప్పారు.ఇది నీ అసమర్ధ పాలనకు అధికార మదానికి నిదర్శనం. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా మీకు నచ్చిన మాటలే మాట్లాడాలా విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారులను భయపెట్టడం ఏంటి.ఎమ్మెల్యే నారాయణఖేడ్ లో మీరు నూతనంగా నిర్మించిన మీ ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ అనుమతి ఉందా.మీ పెట్రోల్ పంపు కు ఫైర్ సేఫ్టీ అనుమతి ప్రికాషన్స్ ఉన్నాయా. మీ సినిమా హాలుకు ఫైర్ సేఫ్టీ ఉందా..నీకు దమ్ముంటే నేరుగా నాతో కొట్లాడు కానీ సామాన్య ప్రజల మీద నీ అధికారం మదం చూపెట్టడం సరికాదు అని హెచ్చరించారు.నువ్వు చేసిందల్లా చూస్తూ ఊరుకోవడానికి నారాయణఖేడ్ ప్రజలు ఏమీ అమాయకులు కాదు నీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు