*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!*
కోహిర్;పలు దొంగతనం (రాబరీ) కేసులను సమర్థవంతంగా ఛేదించి, నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. ఈ సందర్భంగా కోహిర్ ఎస్ఐ నరేష్‌ల, చిరాకుపల్లి ఎస్ఐ వినయ్ కుమార్, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి కి ప్రశంసా పత్రాలను అందజేశారు.విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపులో సమర్థవంతమైన పనితీరు కనబరిచిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, నేరాల నియంత్రణకు మరింత అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.